సినిమాలు చూసి దొంగతనాలు, చోరీలు చేసే స్థాయి నుంచి స్మగ్లింగ్ చేసే వరకూ ఎదిగారు స్మగ్లర్లు. అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ పుష్ప స్టైల్లోనే సూరత్‌లో ఓ గంధపు చెక్కలతో పాటు మొద్దులను స్మగ్లింగ్ చేసి ముఠా పెద్ద మొత్తంలో గంధం దుంగల్ని ఓ గోడౌన్లో దాచి పెట్టారు. సూరత్ పోలీసులు సోయిలో ఉండరనుకున్నారో ఏమో స్మగ్లర్లు ఓ గోడౌన్లో 500కిలోల గంధపు చెక్కలను దాచిపెట్టారు. గంధం వాసన బయటకు రాకుండా పుష్ప సినిమా స్టైల్లో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
ఏటీఎస్, ఎన్ఐ బృందం దాడి చేస్తున్న సమయంలో స్థానిక పోలీసులు , పూణె పోలీసులు నిద్రపోతుండగా నేరస్తుల్ని పట్టుకున్నారు. పట్టుబడిన ఇద్దరు నిందితులలో ఒకరిని ధీరు అహిర్‌గా గుర్తించారు. అతను ఎక్కువగా పూణే పోలీస్ స్టేషన్లో ఉంటాడు. అలాగే స్థానిక పోలీసులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుండటంతో అనుమానం కలిగి పట్టుకున్నారు. ఈ గంధం స్మగ్లింగ్‌లో పోలీసుల పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు అధికారులు.