Sex racket: విదేశీ యువతులతో సెక్స్ రాకెట్... 24 మంది అరెస్టు
Sex racket: విదేశీ యువతులతో సెక్స్ రాకెట్... 24 మంది అరెస్టు
Sex racket: అమ్మాయిలను ఆటబొమ్మల్లా చూసే సంస్కృతికి చెక్ పడట్లేదు. కరోనా టైమ్‌లో విదేశాల నుంచి యువతుల్ని తెప్పించి మరీ సెక్స్ రాకెట్ కొనసాగిస్తున్నారు. దీనిపై పోలీసులు ఏం చెప్పారో తెలుసుకుందాం.
1/ 6
Sex racket: అది హర్యానాలోని... చోనిపాట్ జిల్లా. అక్కడ పోలీసులు ఒకేసారి పెద్ద ఎత్తున రైడింగ్ చేశారు. వారు ఊహించినట్లుగానే పెద్ద సెక్స్ రాకెట్ బయటపడింది. మొత్తం 24 మందిని అరెస్టు చేశారు. వారిలో 12 మంది యువతులు, మహిళలూ ఉన్నారు. వారిలో ఏడుగురు విదేశీ యువతులు ఉన్నారు.
2/ 6
పోలీసుల దర్యాప్తులో ఏం తేలిందంటే... ఓవైపు సెక్స్ రాకెట్... మరోవైపు జూదం (gambling) రెండూ ఒకే చోట కొనసాగుతున్నాయని తేలింది. పేకాట ఆడుతున్న వారి నుంచి పోలీసులు రూ.1.73 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువగా యువతే ఈ జూదం ఆడుతున్నట్లు తెలిసింది.
3/ 6
ముఖ్యమంత్రి ఫ్లైయింగ్ స్క్వాడ్‌కి ఎవరో సమాచారం చేరవేశారు... ఈ వ్యభిచారం సాగుతోంది అని. వెంటనే ఫ్లైయింగ్ స్క్వాట్... పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. అంతే... నిషా డీఎస్పీ అజిత్ సింగ్ అధ్వర్యంలో ఆపరేషన్ చేపట్టారు. స్థానిక వెస్ట్ దాబా హోటల్లో రైడ్ చేశారు. దాంతో సెక్స్ రాకెట్ గుట్టు తెలిసింది.
4/ 6
ఈ ఆపరేషన్ కోసం మొత్తం 9 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం 12 మంది యువతులు, మహిళలతోపాటూ... ముగ్గురు యువకులకు ఈ సెక్స్ రాకెట్‌తో సంబంధం ఉంది అని కనిపెట్టారు.
5/ 6
పోలీసులకు చిక్కిన 12 మంది యువతులు, మహిళల్లో ఐదుగురు ఢిల్లీకి చెందిన వారు. మరో ముగ్గురు ఉబ్జెకిస్తాన్, ముగ్గురు టర్కీ, ఒకరు రష్యాకు చెందిన వారని తెలిసింది. మరో గ్రూపు బ్లూస్టోన్ దాబాలో చేసిన రైడింగ్‌లో జూదం ఆడుతూ... 9 మంది యువకులు పట్టుబడ్డారు.
6/ 6
జూదం ఆడుతూ అరెస్టైన వారు చోనిపాట్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కరోనాతో ఉద్యోగాలు పోవడంతో... వారంతా... అడ్డగోలుగా డబ్బు సంపాదించేందుకు గాంబ్లింగ్ ఆడుతున్నట్లు పోలీసులు తెలిపారు.