సూర్య అనే 35 ఏళ్ల మహిళ టిక్‌టాక్‌లో రౌడీ బేబీ పేరుతో వీడియోలు చేస్తూ ఫేమస్ అయింది. లక్షల్లో ఆమెకు ఫాలోవర్లు ఉండేవారు. కేవలం మంచి వీడియోలతోనే ఆమెకు గుర్తింపు రాలేదు. బూతు వీడియోలు, హాట్ హాట్ వీడియోలను అప్లోడ్ చేస్తూ టిక్‌టాక్ సెలబ్రెటీగా మారింది. ఈమె వీడియోలపై సోషల్ మీడియాలో కూడా మీమ్స్ పేజ్‌ల్లో ట్రోల్స్ బాగానే వచ్చాయి.
సదరు మహిళ యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో కింద ఆమెను బండ బూతులు తిడుతూ రౌడీ బేబీ సూర్య, ఆమె స్నేహితుడు కామెంట్ చేశారు. కొన్నిరోజుల క్రితం ఆ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకురాలు తన పదేళ్ల కూతురితో ఓ వీడియో చేసి తన ఛానల్లో పోస్ట్ చేసింది. ఆ వీడియో కింద వివాదాస్పద రీతిలో రౌడీ బేబీ సూర్య, ఆమె ఫ్రెండ్ కామెంట్ చేశారు.