Andhra Pradesh: మహిళల న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్.. అడ్డంగా బుక్కైన హెడ్ కానిస్టేబుల్..
Andhra Pradesh: మహిళల న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్.. అడ్డంగా బుక్కైన హెడ్ కానిస్టేబుల్..
గుడికి వెళ్లినా మహిళలకు రక్షణ లేదనడానికి ఇదే నిదర్శనం. మహిళలను అసభ్యకరంగా ఫోటోలు తీసి.. ఆలయానికి చెడ్డపేరు తెస్తామంటూ ఇద్దరు వ్యక్తులు బ్లాక్ మెయిలింగ్ దిగారు..
మహిళలు ఎక్కడికెళ్లినా రక్షణ కరువైందనడానికి ఇదే పెద్ద నిదర్శన. దైవదర్శనం కోసం ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకునేముందు స్నానమాచరిస్తుండగా వీడియోలు తీయడమే కాకుండా బ్లాక్ మెయిలింగ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ తో పాటు దళిత సంఘాల నాయకుడు ఉండటం గమనార్హం. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 7
వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం సమీపంలోనే పాండవులమెట్టపై ఉన్న వైర్ లెస్ రిపీటర్ సెంటర్లో కనకారావు అనే వ్యక్తి కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. దగ్గర్లోని సూర్యనారాయణ స్వామి ఆలయం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
గుడికి వచ్చే మహిళా భక్తులు స్నానాలు చేస్తుండగా ఫోటోలు తీసి తమకు పంపాలని అర్చకుడి బంధువైన ఓ బాలుడ్ని కానిస్టేబుల్ కనకారావు కోరాడు. చెప్పింది కానిస్టేబుల్ కావడంతో బెదిరిపోయిన బాలుడు.. అతను కోరినట్లే ఫోటోలు తీసి పంపాడు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
సదరు హెడ్ కానిస్టేబుల్ ఆ ఫోటోలను స్థానిక దళిత సంఘం నాయకుడు రొక్కం శ్యామ్ దయాకర్ కు పంపాడు. వాటిని తమ దగ్గరపెట్టున్న కనకారావు, దయాకర్.. ఆ ఫోటోలతో ఆలయ నిర్వాహకులను బెదరించడం మొదలుపెట్టారు. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 7
తమకు రూ.5 లక్షలు ఇవ్వకుంటే ఫోటోలు బయటపెట్టి పరువు తీస్తామని, ఆలయ విశిష్టతను కూడా దెబ్బతీస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 7
దీంతో హెడ్ కానిస్టేబుల్ కనకరావుతో పాటు శ్యామ్ దయాకర్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మహిళల ఫోటోలు తీసిన బాలుడ్ని జువైనల్ హోమ్ కు తరలించారు. (ప్రతీకాత్మక చిత్రం)