ఈ సంవత్సరం జూన్ 14న వినోద్కి ఫేస్బుక్లో ఓ అమ్మాయి పరిచయమైంది. "చాలా బాగున్నావ్, సూపర్, క్యూట్, నైస్, అదుర్స్" ఇలా రకరకాల ప్రశంసలు కురిపించాడు. ఆమె ఏ ఫొటో పెట్టినా, ఏ వీడియో పెట్టినా... విపరీతంగా పొగిడాడు. దాంతో ఆమె కూడా అతనివైపు ఆకర్షితురాలైంది. రెండు వైపులా ప్రేమ మొదలైంది. ఇవేవీ మొదటి భార్యకు తెలియకుండా వినోద్ డ్రామా నడిపాడు.