సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ నగలు చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దొంగల్ని పట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా ఇంట్లో దాచిన విలువైన నగలు, హారాలు మాయమైపోతుండటంతో ఐశ్వర్య రజనీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్ని గుర్తించారు.(File Photo)
డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా అనుమానితుల్ని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. ఇంట్లో పని చేస్తున్న పని మనిషి ఈశ్వరితో పాటు ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా.. వివిధ సమయాల్లో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ఐశ్వర్య రాజనీకాంత్ ఇంట్లో చోరీ చేసిన నగలు, ఆభరణాలను విక్రయించగా వచ్చిన డబ్బుతోనే తాను ఇల్లు కొనుక్కున్నానని ఈశ్వరి పేర్కొంది. ఒకటి రెండు కాదు సుమారు కోటి రూపాయల విలువ చేసే ఇంటిని ఈశ్వరి షోలింకనల్లూరులో కొనుగోలు చేసింది. అయితే ఎవరికి అనుమానం రాకుండా ఆ ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తీసుకున్నారు. రెండేళ్లలో రుణం మొత్తం చెల్లించారు.(File Photo)
ఈ భారీ దొంగతనం కేసులో పని మనిషి ఈశ్వరితో పాటు డ్రైవర్ వెంకటేష్ పాత్ర కూడా ఉందని గుర్తించారు. ఇద్దర్ని అరెస్ట్ చేశారు. మరికొందర్ని అనుమానిస్తున్నారు. ఈ భారీ చోరీ కేసులో 100 సవర్ల బంగారం, 30 గ్రాముల వజ్రాభరణాలు, 4 కిలోల వెండిని ఈశ్వరి దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటి విలువ కోటికిపైగా ఉంటుందని అంచనా వేశారు.(File Photo)