కిరాత హంతకుడు, శవాలను రేప్ చేసే డేవిడ్ లాంటి హేయమైన మృగం ఈ సొసైటీలో ఉంటే ప్రమాదమని.. అందుకే అతడు చచ్చిపోయేంత వరకు జైల్లోనే గడపాలంటూ కోర్టు జడ్జి డిసెంబర్ 15న తీర్పు వెలువరించారు. 1987లో చేసిన డబుల్ మర్డర్లకు రెండు జీవిత ఖైదులను, మృతదేహాలను రేప్ చేసినందుకు ఏకకాలంలో 12 ఏళ్ల శిక్షను డేవిడ్ ఫుల్లర్ కు విధించారు .
రేప్వీడియోలు తీసుకొని మరీ..
ఫుల్లెర్ 33 ఏళ్ల క్రితం జరిగిన విండీ కెనెల్, కారోలిన్ పియర్స్ జంట హత్యల్లో సంబంధం కలిగి ఉన్నట్లు డీఎన్ఏ పరీక్షల తర్వాత తెలిసింది. ఇంగ్లండ్‌లోని ఈస్ట్ సస్సెక్స్‌లోని హీత్‌ఫీల్డ్ అనే నగరంలో డేవిడ్ నివసించేవాడు. డిసెంబర్ 2020లో అతని ఇంటిపై అధికారులు రైడ్ చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)
ఆ సమయంలో అధికారులు కొన్ని హార్డ్ డ్రైవ్‌లను కనుగొన్నారు. వాటిలో డేవిడ్ శవాలపై చేసిన రేప్ వీడియోలు, ఏహ్యమైన పోర్నోగ్రఫీ వీడియోలు ఉన్నాయి. అవి చూసి మనుషులు ఇలా కూడా ఉంటారా అని వాళ్ళంతా షాకయ్యారు. డేవిడ్ 2008 నుంచి 2020 కాలం వరకు 9 ఏళ్ల నుంచి 100 ఏళ్ల మధ్య వయస్సు గల 102 శవాలను రేప్ చేశాడని విచారణలో తేలింది.(ప్రతీకాత్మకచిత్రం)