ONLINE LOAN APP DANGER FOR USERS DATA THEFT AND HARASSMENT PROBLEMS MAY ARISE AK
Online Loan Apps: అప్పులిచ్చే ఆన్లైన్ యాప్స్.. అన్ని రకాలుగా డేంజరే.. ఎలాగంటే..
Online Loan Apps: యాప్‌ల యూజర్లు లిఖితపూర్వకంగా లేని రూపంలో తమ కాంటాక్ట్ నెంబర్లు, ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా సమాచారం ఇతర వ్యక్తిగత సున్నిత అంశాలను తమకు తెలియకుండానే అందిస్తుంటారు.
ప్రస్తుతం చలామణిలో ఉన్న లోన్లు ఇచ్చే ఆన్లైన్ యాప్స్‌లో అధికశాతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నమోదు కాలేదని, అందువల్ల వారికి రుణాలు అందించే అధికారంలేదని తెలంగాణ డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది.
2/ 8
ఈ యాప్‌లలో అధికంగా చైనీస్ వే ఉన్నాయని... వాటికి రిజిస్టర్ అయిన చిరునామా, సరైన మొబైల్ నెంబర్ ఇతర వివరాలు ఉండవు.
3/ 8
ఫోన్ ద్వారానే సమాచారాన్ని సమాచారాన్ని యాప్‌ల నిర్వాహకులు తెలుసుకుంటారు. ఈ యాప్‌ల యూజర్లు లిఖితపూర్వకంగా లేని రూపంలో తమ కాంటాక్ట్ నెంబర్లు, ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా సమాచారం ఇతర వ్యక్తిగత సున్నిత అంశాలను తమకు తెలియకుండానే అందించే అవకాశం ఉంది.
4/ 8
యాప్‌ల ద్వారా తీసుకున్న రుణాలను చెల్లించని బాదితులను వేధించేందుకు ఈ సమాచారాన్ని రుణాలు అందించే యాప్‌ల నిర్వాహకులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రుణాలు స్వీకరించే సమయంలో ఏవిధమైన షరతులకు అంగీకరించవద్దు.
5/ 8
ముఖ్యంగా మీ వ్యక్తిగత వివరాలు, ఆధార్, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లో అందజేయవద్దు. ఈ యాప్‌ల ద్వారా అందించే రుణాల వడ్డీ రేట్లు రోజుకు ఒక శాతం వరకు ఉంటాయి.
6/ 8
ఇది సాధారణంగా బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సి రిజిస్టర్ అయిన సంస్థలు అందించే రుణ వడ్డీలకన్నా అత్యధికం. రుణబాదితులు సకాలంలో చెల్లించని పరిస్థితిలో ఈ వడ్డీ మొత్తం రెట్టింపు లేదా మూడొంతులు అయి రుణవలయంలో చిక్కుకుంటారు.
7/ 8
దీంతో రుణాలు చెల్లించని రుణగ్రహితలను తిరిగి చెల్లించమని బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు ఆన్లైన్ వేదింపులకు ఈ యాప్ లు పాల్పడుతాయి.
8/ 8
రుణాలను చెల్లించకపోతే మీపై క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరుగుతుందని రుణం అందించే యాప్‌లు బెదిరించే అవకాశం ఉందని, ఈ పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలంగాణ డీజీపీ కార్యాలయం తెలిపింది.