పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేనీ జిల్లా కంభం కురంగ్మయాన్ వీధికి చెందిన గౌతమ్‌కు అదే ప్రాంతానికి చెందిన భువనేశ్వరి(21)తో వివాహం జరిగింది. ఊహించని విధంగా భువనేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఆత్మహత్య కేసును విచారించిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. పెళ్లయి నెల కూడా కాక ముందే భువనేశ్వరి ఎందుకు చనిపోయిందని పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు.
భార్య ప్రేమగా అడిగిందని భావించిన భర్త గౌతమ్ ఆమెను తీసుకుని బైక్‌పై బయటకు వెళ్లాడు. బైక్ తమ్మనంపట్టి వద్దకు రాగానే బండి పంక్చర్ అయింది. బైక్‌ను తోసుకుంటూ భార్యతో కలిసి నడుచుకుంటూ వస్తున్న గౌతమ్‌ను ఓ కారులో వెంబడించి అతనిని కారుతో ఢీ కొట్టారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు. కారులో నుంచి దిగి గౌతమ్‌పై దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత అదే కారులో పరారై వెళ్లిపోయారు. ఆ కారు కేరళ రిజిస్ట్రేషన్‌తో ఉండటాన్ని గౌతమ్ గమనించాడు.
తనపై ఇలా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని, కారు నెంబర్‌ను, కేరళ రిజిస్ట్రేషన్‌తో ఉన్న విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ఆ కారులో వచ్చి గౌతమ్‌పై దాడి చేసింది మరెవరో కాదు భువనేశ్వరి స్నేహితుడు నిరంజన్, అతని స్నేహితులు. ఈ విషయం విచారణలో బయటకు వస్తే తన పేరు కూడా వెలుగులోకి వస్తుందని, భర్త హత్యకు ప్లాన్ చేసిన విషయం బయటపడుతుందని భువనేశ్వరి ఆందోళనకు లోనైంది.