చిక్బళ్లాపురం: తెలిసీతెలియని వయసులో ప్రేమ, పెళ్లి అంటూ కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నాయి. పట్టుమని పద్దెనిమిదేళ్లు నిండక ముందే ప్రేమ పేరుతో కొందరు టీనేజర్లు ఊహల లోకంలో విహరిస్తున్నారు. చదువు, ఉద్యోగం.. జీవితంలో నిలదొక్కుకోవడం వంటి విషయాలను పక్కన పెట్టి ప్రేమాయణం సాగిస్తున్నారు.