దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఫ్యామిలీ సూసైడ్ కేసు కలకలం రేపుతోంది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమా స్టోరీని మించిపోయే విధంగా ఈ ట్రిపుల్ డెత్ కేసు ఉండటంతో ఢిల్లీ పోలీసులకు మతిపోయింది. అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఉన్న వసంత్ విహార్ సొసైటీలోని అపార్ట్మెంట్లో నెంబర్ 207ఫ్లాట్‌లో ట్రిపుల్ సూసైడ్ కేసు స్థానికంగా కలకలం సృష్టించింది.
తల్లి, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు ..? ఎలా చేసుకున్నారో తెలిసి స్థానికులతో పాటు పోలీసులు షాక్ అయ్యారు. ముందు లోపలి నుంచి తాళాలు వేసుకొని..అటుపై గ్యాస్ సిలెండర్ ఓపెన్ చేశారు. తమ ఫ్లాట్‌ని పూర్తిగా గ్యాస్ ఛాంబర్‌గా మార్చేశారు. ముగ్గురూ బెడ్రూంలో పడుకొని ఊపిరాడకపోవడంతో ప్రాణాలు వదిలారు. మృతుల్లో తల్లి మంజు, కూతుళ్లు అన్షిక, అంకూగా తేల్చారు పోలీసులు.
[caption id="attachment_1308632" align="alignnone" width="1600"] అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ 207లో వ్యక్తులు ఎవరూ బయటకు రాకపోవడం, తలుపులు తీయకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పాట్‌కి చేరుకున్న పోలీసులు డోర్లు పగులగొట్టి ఇంటిని పరిశీలించారు. బెడ్రూంలోకి వెళ్లి చూడగా తల్లి, ఇద్దరు కుమార్తెలు విగతజీవులుగా ఉండటాన్ని గుర్తించారు. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.
చూడటానికి చదువుకున్న వాళ్లలా కనిపించే ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏమిటంటే ఇంటి పెద్ద ఉమేష్ చంద్ర శ్రీవాస్తవ వృత్తిరీత్యా అకౌంటెంట్‌గా పనిచేసే వాడు. 2021లో కరోనాతో చనిపోవడంతో అతని భార్య మంజు, కుమార్తెలు అన్షిక, అంకూ ఇంట్లో మగదిక్కు లేకుండా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూ వచ్చారు. ఆదే బాధతో డిప్రెషన్లోకి వెళ్లి సూసైడ్ ప్లాన్ చేసుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది.