మంటలు అంటుకోగానే... బాధితురాలు దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ కేకలేస్తూ తీవ్ర ఆర్తనాదాలు చేసింది. ఆ అరుపులు దూరంగా ఉన్న ఊరి వరకూ వినిపించాయి. ఏమైంది... అయ్యో అయ్యో అనుకుంటూ వారంతా... పరుగులు పెడుతూ... ఎవరూ లేని ఆ పాత ఇంటి దగ్గరకు వచ్చారు. అప్పటికే ఆమె శరీరమంతా మంటలు వ్యాపించేశాయి. వెంటనే ఆమెపై బట్టలు కప్పి... పోలీసులకు కాల్ చేశారు. అప్పటికే ఆ ప్రేమికుడు పారిపోయాడు.
పోలీసులు కృష్ణచంద్ర సాహు కోసం వెతుకుతున్నారు. ప్రేమ పేరుతో అతను ఉదయాన్నే ఆమెకు కాల్ చేసి బయటకు రమ్మన్నాడు. ఆమె ఇంట్లో ఏదో చెప్పి బయటకు వచ్చింది. ఆ తర్వాత మధ్యాహ్నం లోపు ఓసారి ఆమె తండ్రి ఆమెకు కాల్ చేశాడు. అప్పుడు తాను బయట ఉన్నాననీ, బాగానే ఉన్నానని చెప్పింది. ఆ తర్వాత ఈ దారుణం జరిగింది. ఈ విషాద ఘటన స్థానికుల్ని, పోలీసుల్నీ, డాక్టర్లనీ అందర్నీ కలచివేసింది.