ఈ ఘటన రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో జరిగింది. విదేశాల్లో ఉంటున్న అల్లుడు తన భార్యను వెంటపెట్టుకొని అత్తారింటికి వచ్చాడు. అతనికి ముగ్గురు పిల్లలున్నారు. వారు విదేశాల్లోనే ఉన్నారు. అల్లుడితో లేచిపోవాలనుకున్న అత్త పక్కా ప్లాన్ వేసింది. వంటగది నుంచే ప్లాన్ అమలుచేసింది. అల్లుడితో ఆమె ప్రేమాయణం సాగిస్తున్న విషయం ఇన్నేళ్లూ ఎవరికీ తెలియదు. ఇప్పుడు తెలిశాక అంతా షాక్‌లో ఉన్నారు.
అనదర పోలీసులు కేసు రాశారు. నారాయణన్‌ను విదేశాల నుంచి భారత్‌కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను ఇండియా వచ్చాక అతనికీ, అత్తగారికీ కౌన్సెలింగ్ ఇస్తామని అంటున్నారు. ఐతే.. ఈ ఘటన స్థానికంగా అందరికీ తెలిసింది. ఇంటి పరువు పోయింది. అందరూ విషయం తెలుసుకొని.. అవ్వ.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. సమాజం ఎటు పోతోందని ప్రశ్నిస్తున్నారు.