ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని చింతల్ భగత్‌సింగ్ నగర్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన సురేష్‌కు, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఉదయకు కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకుని జగద్గిరిగుట్టలో కాపురం పెట్టారు.
పెళ్లయిన కొన్నాళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఒక బాబు పుట్టాడు. ఆ మూడేళ్ల పిల్లాడిని చూసుకుంటూ ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. అయితే.. కొన్ని నెలల క్రితం సురేశ్‌కు భాస్కర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కర్నాటకకు చెందిన భాస్కర్‌ను సురేశ్ ఎంతగానో నమ్మాడు. భాస్కర్ కూడా సురేశ్‌ను తన దగ్గరే పనిలో పెట్టుకున్నాడు. సురేశ్‌ను భాస్కర్ అన్న అని పిలిచేవాడు.
సోదరభావంతో ఉన్నాడనుకుని సురేశ్ కూడా భాస్కర్‌ను ఇంటికి తీసుకెళ్లి భార్యకు పరిచయం చేశాడు. తనకు భాస్కర్ తమ్ముడి లాంటి వాడని, తనకు పని కల్పించింది కూడా భాస్కరేనని భార్య ఉదయకు సురేశ్ చెప్పాడు. దీంతో.. అతనిపై ఉదయ అభిమానాన్ని పెంచుకుంది. భాస్కర్ కూడా ఆమెను వదిన అని పిలుస్తూ ఇంట్లో సొంత మనిషిలా ఉండేవాడు. సురేశ్ కూడా భాస్కర్‌ను సొంత తమ్ముడిలా చూసుకునేవాడు. కానీ.. భాస్కర్ మాత్రం తన వక్రబుద్ధిని బయటపెట్టాడు.
సురేశ్‌ను చూసిన భాస్కర్ అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ సమయంలో భార్యను సురేశ్ కోపంతో మందలించాడు. మళ్లీ ఇలా జరిగితే ఊరుకునేది లేదని భార్య ఉదయను సురేశ్ హెచ్చరించాడు. భర్త మందలించడంతో అప్పటి నుంచి ఉదయ కట్టుకున్న భర్తతో అంటీముట్టనట్టుగా ఉండేది. భార్యను చేసిన తప్పుకు సురేశ్ నిలదీయడంతో ఆమె పిల్లాడిని తీసుకుని ఇంట్లో నుంచి అలిగి వెళ్లిపోయింది.
ఒకరోజు.. బాబు అన్నం తినకుండా మారాం చేయడంతో ఆ పిల్లాడిని తల్లి ఉదయ కొట్టింది. ఆ సమయంలో ఆమెతో పాటే ఉన్న భాస్కర్.. చిన్న పిల్లాడన్న కనికరం కూడా లేకుండా బాబును వైరుతో విచక్షణారహితంగా కొట్టాడు. కన్నతల్లి అయి ఉండి ఉదయ కనీసం భాస్కర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కాలితో ఆ పిల్లాడి కడుపులో తన్నాడు. దెబ్బలకు తాళలేకపోయిన ఆ పసి ప్రాణం కాసేపటికే గాల్లో కలిసిపోయింది.
ఇరుగుపొరుగు వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం మోజులో పడి వదిన అని పిలిచిన వ్యక్తితోనే కామంతో కళ్లుమూసుకుపోయి చనువుగా మెలిగిన ఉదయ పోలీస్ స్టేషన్లో తలదించుకుని నిల్చుంది. తల్లి వివాహేతర సంబంధానికి ఏ పాపం తెలియని ఆ బాబు బలి కావడం శోచనీయం.