ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. మనం తెలుగులో కొన్ని సినిమాలు ఇలాంటి ఘటన మాదిరి స్టోరీలతో కూడా వచ్చాయి. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియుడిని మర్చిపోలేక ఉండటంతో.. భర్త స్వయంగా ఆమెను ప్రియుడి వద్దకు పంపిస్తాడు. ఇలా తెలుగులో కన్యాదానం మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా అలానే జరిగింది. యూపీలోని మురాదాబాద్ జిల్లా మఝోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.