కాసేపటికి బాలిక అక్కడ కనిపించకపోవడంతో తల్లి కంగారుపడింది. ఇంట్లో అంతా వెతికినా కనిపించలేదు. ఐతే సమీపంలో పంట పొలాల నుంచి బాలిక ఏడుస్తున్న శబ్ధం వినిపించడంతో అందరూ అక్కడికి పరుగెత్తికెళ్లారు. గాయపడిన స్థితిలో కనిపించడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. కుటుంబ సభ్యులు వెంటనే సదర్ ఆస్పత్రికి తరలించారు. (ప్రతీకాత్మక చిత్రం)
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు జాముయ్ ఎస్డీపీవో రాకేశ్ కుమార్ తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)