ఇంట్లో ఒంటరిగా భార్య.. పొలానికి వెళ్లి వచ్చిన భర్తకు ఇంట్లో కనిపించిన సీన్ తో షాక్ అయ్యాడు.. అసలేం జరిగిందంటే..
ఇంట్లో ఒంటరిగా భార్య.. పొలానికి వెళ్లి వచ్చిన భర్తకు ఇంట్లో కనిపించిన సీన్ తో షాక్ అయ్యాడు.. అసలేం జరిగిందంటే..
Telangana: నల్గొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురంలో వివాహిత మహిళ బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన ఓర్సు వెంకన్న భార్య సరిత(32) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో ఓర్సు వెంకన్న, ఓర్సు సరిత(32) దంపతులు నివసిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
అతడు తనకు ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుండగా.. సరిత ఇంట్లో ఉంటుంది. ఓ రోజు అతడు ఎప్పటి లాగే ఉదయం లేచి పొలానికి వెళ్తున్నాని భార్యకు చెప్పి వెళ్లాడు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో అతడు తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపు తీయగానే అతడికి గుండె ఆగే పని అయింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
తన భార్య ఇంట్లో ఉరేసుకొని కనిపించింది. దీంతో బోరన విలపించగా.. చుట్టుపక్కన నివసించే గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
విషయం పోలీసులకు తెలపడంతో ఘటనా స్థలానికి వచ్చి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమె ఆత్మహత్య చేసుకోటానికి ముందు 25 నిమిషాల పాటు వేరొకరితో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఆమె ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)