నాగౌవ్: అస్సోంలోని నాగౌవ్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకొచ్చింది. ఓ వ్యక్తితో పెళ్లైన మహిళ గత పదేళ్లలో పలువురి మగాళ్లతో 20 నుంచి 25 సార్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ మహిళ తిరిగి ఇంటికి వస్తే భార్యగా ఆమెను ఏలుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె భర్త ఇప్పటికీ చెబుతున్నాడు. అంతమంది మగాళ్లతో భార్య వెళ్లిపోయినా ఇప్పటికీ ఆమెతో కలిసి ఉండేందుకు ఆ మహిళ భర్త సిద్ధంగా ఉన్నాడు.
ఆ మహిళకు ముగ్గురు పిల్లలు. మూడో బాబు వయసు మూడు నెలలు. ఎవరో ఒక మగాడితో ఇంట్లో నుంచి వెళ్లిపోవడం.. కొన్ని రోజుల తర్వాత మళ్లీ భర్తను వెతుక్కుంటూ రావడం. ఇలా ఆమె 25 సార్లు చేసింది. ఆమె తన పుట్టిన ఊర్లో ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండేదని.. ఈసారి అతనితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉండొచ్చని గ్రామస్తులు అనుకుంటున్నారు. ఆమె భర్త వృత్తి రీత్యా డ్రైవర్.
సెప్టెంబర్ 4న మోటార్ గ్యారేజ్ నుంచి సదరు మహిళ భర్త ఇంటికి తిరిగొచ్చాడు. ఇంట్లో ఎంత వెతికినా భార్య కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. పుట్టింటికి ఏమైనా వెళ్లి ఉంటుందేమోనని అత్తమామలకు కాల్ చేస్తే ఇక్కడికి రాలేదని సమాధానమిచ్చారు. మూడు నెలల బాబును ఇంటి దగ్గర్లోని ఓ ఇంట్లో వదిలిపెట్టి ఆమె వెళ్లిపోయినట్లు భర్త గుర్తించాడు. ఆ ఇంట్లో వాళ్లను తన భార్య ఎక్కడికి వెళుతుందో చెప్పిందా అని అడిగితే.. పిల్లాడిని తమకిచ్చి మేకలకు మేత తీసుకురావడానికి వెళుతున్నానని చెప్పి వెళ్లిందని ఆ పొరుగింటి వారు చెప్పారు.