అయితే ఆర్తిని.. ఫాలియాకు చెందిన దినేష్ బారియా అనే వ్యక్తి ప్రేమించాలని, తనతో గడపాలని వేధింపులకు గురిచేశాడు. ఇంట్లో ఆమె భర్త లేని సమయంలో తనతో బంధం కొనసాగించాలని ఒత్తిడి తెచ్చాడు.దీంతో విసుగు చెందిన ఆర్తి.. భర్త, ఇద్దరు కొడుకులతో కలిసి అహ్మదాబాద్‌కు మకాం మార్చింది. అక్కడ సింధూ భవన్ రోడ్డులో నివాసం ఉండసాగారు. అయితే ఈ విషయం తెలుసుకున్న దినేష్.. అహ్మదాబాద్‌కు వచ్చి అక్కడే ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.
కొద్ది రోజుల క్రితం ఆర్తి.. తన తండ్రికి ఇంటికి వెళ్లిన సమయంలో దినేష్ అక్కడికి వెళ్లాడు. అప్పుడు ఆర్తిని మెట్ల వద్దకు పిలిచి.. తనతో పాటు బయటకు వాక్కు రావాలని కోరాడు. అయితే అందుకు ఆర్తి నిరాకరించింది. దీంతో దినేష్.. ఆర్తి సోదరుడు, తండ్రిని చంపుతానని బెదిరించాడు. భయపడిపోయిన ఆర్తి.. దినేష్‌తో కలిసి వాక్కు వెళ్లింది. ఈ విషయం కాస్తా ఆర్తి భర్తకు తెలియడంతో తన మామకు విషయం చెప్పాడు.