అది ఆస్ట్రేలియాలోని టూరిస్ట్ ప్లేస్ బాలీ. అక్కడో వర్క్ షాప్ నడుస్తోంది. సడెన్గా పోలీసులు వచ్చి... దాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే... భావప్రాప్తి (orgasm) కోసం ఎలా ధ్యానం (Meditation) చెయ్యాలో చెబుతా అంటూ... ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నాడు. దీనిపై స్థానికులు కంప్లైంట్ ఇవ్వడంతో... పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. (symbolic image)
ఆన్లైన్ సోర్స్ ప్రకారం... బార్నెస్... ఓ మెడిటేటర్. అంటే ధ్యానం ఎలా చెయ్యాలో చెప్పే టీచర్ అనుకోవచ్చు. ఐతే... ఇతను మన యోగా గురువు బాబా రాందేవ్ లాగా మంచి ధ్యానం చెప్పడు. తాంత్రిక పద్ధతుల్లో సెక్స్ కోరికలను పెంచుకోవడం, మంత్రాల ద్వారా సెక్స్ ఆనందాన్ని పొందడం వంటివి చెబుతాడట. తన వర్క్ షాపుకి కూడా అలాంటి పేరే పెట్టాడు. తాంత్రిక్ ఫుల్ బాడీ ఎనర్జీ భావప్రాప్తి సాధన అని పెట్టాడు. (symbolic image)
అతని వాలకం చూశాక పోలీసులు అతన్ని అరెస్టు చెయ్యలేదు. కానీ పాస్పోర్ట్ తీసుకున్నారు. ఇంతకీ ఈ వర్క్ షాపులో పాల్గొనే వారి నుంచి ఒక్కొక్కరి దగ్గరా ఎంతెంత తీసుకున్నాడో తెలుసా... పెద్దవాళ్లకే ఎంట్రీ ఉంది. ఒక్కొక్కరి దగ్గరా 500 డాలర్లు లాగేశాడు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.36,640. బార్నెస్కి ఓ విల్లా ఉంది. పోలీసులు ఆయన్ని అక్కడికి పంపి... ఇంకెప్పుడూ ఇలాంటివి చెయ్యవద్దని వార్నింగ్ ఇచ్చారు. మనషుల్లో రకరకాలుంటారని మనం పైన అనుకున్నాం. ఇతనో రకం అని మీకు అనిపించే ఉంటుంది. (symbolic image)