అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న వ్యవహారంలో యువకుడికి ఊహించని షాక్.. ఇంతలోనే ఎంతపనయింది..!

కర్ణాటకలో ఓ వ్యక్తి అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నాడనే వార్త సోషల్ మీడియాలో, మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లలో ఒకరు మైనర్ కావడంతో బాల్య వివాహం చేసుకున్న కేసులో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.