అప్పుల బాధతో చనిపోయిన వాళ్లు ఉన్నట్టే.. అప్పు ఇచ్చి మరీ బాధలు పడుతున్న వాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తమ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనీ, తీసుకున్న అప్పును తిరిగి తీర్చాలని ఎన్నిసార్లు ఇళ్ల చుట్టూ తిరిగినా రేపుమాపంటూ అప్పిచ్చిన వారిని తిప్పుతూనే ఉండే వాళ్లు కోకొల్లలు. (బాధితుడు గణేష్ ఫైల్ ఫొటో)
గురువారం ఉదయం తన స్నేహితులతో కలిసి అక్కడకు వచ్చాడు. ఓ ఆటోలో రాజేశ్ ఇంటి ముందు టెంటు వేశాడు. ఓ పది కుర్చీలను కూడా తెచ్చుకున్నాడు. ఓ కుర్చీలో కూర్చుని నిరసన మొదలు పెట్టాడు. తన ఇంటి ముందే టెంటు వేసుకుని మరీ గణేష్ ఇలా నిరసనకు దిగడంతో రాజేశ్ కంగుతిన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశాడు. (ప్రతీకాత్మక చిత్రం)