తెలంగాణలోని నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేశాడు. బీరు సీసాతో పొడిచి ప్రాణాలు తీశారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
ఈ ఘటన జిల్లాలోని నాగార్జున సాగర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్యం మత్తులో ప్రియురాలు చందనను ప్రియుడు శంకర్ బీరు సీసాతో పొడిచి చంపాడు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
నాగార్జున సాగర్‌లోని శివం హోటల్ సమీపంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చందన పెళ్లికి నిరాకరించడంతో శంకర్ ఈ దారుణానికి పాల్పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)