తరచూ వాళ్లిద్దరూ అడవిలోని తుప్పల్లోకి వెళ్లి.. అక్కడ క్షుద్రపూజలు చేస్తున్నారు. ఎంత చేసినా శక్తులేవీ రాలేదు. దాంతో.. ఎవర్నైనా బలి ఇస్తే.. శక్తులు వస్తాయని బసంత్ సాహూ చెప్పాడు. ఎవర్ని బలి ఇవ్వాలి అనే దానిపై అతను ఆలోచనల్లో పడ్డాడు. అదే సమయంలో.. రౌనక్ సింగ్ మరోలా ఆలోచించాడు. శక్తులు వస్తే.. అవి తన గురువుకి వస్తాయి తప్ప తనకు రావు అనుకున్నాడు. తన గురువునే బలి ఇచ్చేస్తే.. ఆ శక్తులు తనకి వస్తాయని అనుకున్నాడు. (ప్రతీకాత్మక చిత్రం)
ప్లాన్ ప్రకారం బసంత్ సాహూ క్షుద్రపూజ చేస్తుండగా... ఒక్క వేటు వేసి చంపేసిన రౌనక్ సింగ్... ఓ పాత్రలో అతని రక్తాన్ని పట్టుకొని గటగటా తాగేశాడు. ఇక తనకు అతీంద్రియ శక్తులు వచ్చేస్తాయని భావించాడు. చచ్చిపోయిన గురువును తగలబెట్టేస్తే.. ఎవరికీ తెలియదు అనుకొని మృతదేహాన్ని తగలపెట్టేందుకు మంట పెట్టాడు. ఆ తర్వాత కాసేపు క్షద్ర పూజ చేసి... ఆ తర్వాత మంటల్లో మృతదేహాన్ని వేశాడు. అంతలోనే పోలీసులు రావడంతో... తప్పించుకునేందుకు యత్నించాడు. (ప్రతీకాత్మక చిత్రం)