మటన్ వడ్డించే విషయంలో చోటుచేసుకున్న గొడవ.. ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
వివరాలు.. మంచిర్యాల జిల్లా అంకుశాపూర్కు చెందిన 15 మంది కూలీలు నెల రోజుల కిందట సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ శివారులోని శ్రీసాయి బాలాజీ నర్సరీలో పనికి వచ్చారు. అక్కడ మొక్కలకు అంటు కట్టే పనులు చేస్తున్నారు అక్కడే రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
అయితే సెప్టెంబర్ 15న సాయంత్రం పనులు పూర్తి అయిన తర్వాత కూలీలు దావత్ చేసుకున్నారు. అయితే వారు భోజనం చేస్తున్న సమయంలో గోస్కుల పాపన్న, దయనేని శివల మధ్య మటన్ వడ్డించే విషయంలో వాగ్వాదం మొదలైంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే శివ ఇనుప పైపుతో పాపన్నపై దాడి చేశాడు. దీంతో పాపన్న తలకు బలమైన గాయం అయింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
దీంతో పాపన్నను అక్కడున్న వారు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. గత వారం రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాపన్న.. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతిచెందారు.(ప్రతీకాత్మక చిత్రం)