ఓ కన్నతండ్రి నీచమైన పనికి పాల్పడ్డాడు. డబ్బుల కోసం తన కూతురిని అమ్మేశాడు. ఈ షాకింగ్ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
పోలీసులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ పట్టణంలోని హనుమాన్‌పురకు చెందిన సయ్యద్ రహీం, నౌషిమ్ బేగం దంపతులకు ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. కుమార్తె జేబా వయసు 18 నెలలు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
తాగుడుకు బానిసైన రహీం.. డబ్బుల కోసం తన కూతురిని అమ్మేశాడు. మే 18న బిస్కెట్లు ఇప్పిస్తానని నమ్మబలికిన రహీం కూతురిని బయటకు తీసుకెళ్లాడు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఆ రోజు సాయంత్రం తిరిగి ఇంటికి ఒక్కడే వచ్చాడు. దీంతో భార్య కుమార్తె ఏమైందని ప్రశ్నించగా.. రహీం సరైన సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత గట్టిగా ప్రశ్నించడంతో.. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ హఫీజ్‌కు రూ.15 వేలకు విక్రయించినట్లు తెలిపాడు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఈ ఘటనతో షాక్ గురైన రహీం భార్య నౌషీమ్.. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. తన కూతురిని రక్షించాలని వేడుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పాప హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. పాపను రక్షించి మహబూబ్‌నగర్ సీడబ్ల్యూసీ అధికారులకు అప్పగించారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఈ కేసుకు సంబంధించి పాపను కొనుగోలు చేసిన వ్యక్తితో పాటు, పాప తండ్రి రహీంలను పోలీసులు అరెస్ట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)