కొత్త రకం దందా.. నలుగురు యువతులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంతకీ వారు ఏం చేశారంటే..?
కొత్త రకం దందా.. నలుగురు యువతులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంతకీ వారు ఏం చేశారంటే..?
అనుమానస్పదంగా కనిపించిన నలుగురు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు హై ప్రొఫైల్ యువతులుగా నటించి.. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కారని పోలీసులు తెలిపారు.
అనుమానస్పదంగా కనిపించిన నలుగురు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు హై ప్రొఫైల్ యువతులుగా నటించి.. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన గుజరాత్‌లోని కృష్ణానగర్‌లో చోటుచేసుకుంది. నలుగురు మహిళలను మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు.
2/ 5
నలుగురు యువతులు ట్రైన్లో ఎక్కి.. హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తుల్లాగా ప్రవర్తించేవారు. వారిపై అనుమానం రాకుండా ఉండేందుకు ఒకరితో ఒకరు మాట్లాడేవారు కాదు. అంతేకాకుండా వేర్వేరు బోగీలో ఉంటూ.. తమ బ్యాగుల్లో తెచ్చుకున్న బీర్ టీన్స్ను అహ్మదాబాద్‌లోని ఓ వ్యక్తి వద్దకు తీసుకెళ్లేవారు.
3/ 5
మహారాష్ట్రకు చెందిన యువతులు ట్రైన్లో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నారనే సమాచారం రావడంతో కృష్ణానగర్ పోలీసులు ఈ విషయంపై దృష్టి సారించారు. పూర్తి నిఘా ఉంచిన పోలీసులు నలుగురు యువతులను అరెస్ట్ చేశారు. వారి బ్యాగులను తనిఖీ చేసి.. 214 బీర్ టీన్స్ను స్వాధీనం చేసుకున్నారు.
4/ 5
పోలీసులు అరెస్ట్ చేసినవారిలో లక్ష్మి, పూర్ణిమ, పూజా, సునీత ఉన్నారు. వీరు మహారాష్ట్రాలో వేర్వేరు ప్రాంతాలకు చెందినవారని పోలీసులు తెలిపారు. వీరందరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
5/ 5
ఈజీ మనీ కోసం యువతులు ఈ మార్గం ఎంచుకున్నారని పోలీసులు వెల్లడించారు. ‘నలుగురు యువతులు ట్రైన్లో ఉన్న సమయంలో ఒకరితో మరోకరికి పరిచయం లేనట్టుగా ఉంటారు. కనీసం మాట్లాడుకోవడం కూడా చేయరు. కానీ అహ్మదాబాద్‌లో ఒకే వాహనంలో కలిసి ప్రయాణించారు’అని పోలీసులు తెలిపారు.