MAHARASHTRA BJP MLA SON AMONG 7 MEDICAL STUDENTS KILLED IN FATAL ROAD ACCIDENT IN WARDHA PM MODI ANNOUNCES EX GRATIA MKS
BJP ఎమ్మెల్యే కొడుకు సహా 7 మెడిసిన్ విద్యార్థులు దుర్మరణం.. PM Modi పరిహారం: Maharashtra Accident
మహారాష్ట్రలో అతి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతోన్న కారు ప్రమాదవశాత్తూ వంతెనను ఢీకొట్టి 40 అడుగుల లోయలో కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మెడిసిన్ విద్యార్థులు దుర్మరణం చెందారు. చనిపోయినవారిలో మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నాడు. వివరాలివే..
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో సెల్సురా వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహేంద్ర జైలో వాహనంలో డియోలీ నుంచి వార్ధాకు వెళ్తుండగా.. సెల్సురా వద్దకు రాగానే డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.
2/ 7
బ్రిడ్జి పైనుంచి 40 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్నవాళ్లంతా స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన విద్యార్థుల్లో తిరోడా గోరెగావ్ ఎమ్మెల్యే విజయ్ రహంగ్డలే కొడుకు ఆవిష్కార్ రహంగ్డలే కూడా ఉన్నారు.
3/ 7
ఎమ్మెల్యే కొడుకు సహా కారులో ప్రయాణించిన విద్యార్థఉలు సావాంగిలోని మెడికల్ కాలేజీలో చదువుతున్నారు. నిన్న రాత్రి వీరంతా కారులో డియోలీ నుంచి వార్దాకు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
4/ 7
సెల్సురా రోడ్డు ప్రమాద ఘటనలో చనిపోయినవారిలో ఎమ్మెల్యే కొడుకు ఆవిష్కార్ రహంగ్డలే సహా నీరజ్ చవాన్, నితేష్ సింగ్, వివేక్ నందన్, ప్రత్యూష్ సింగ్, శుభమ్ జైస్వాల్, పవన్ శక్తి అనే విద్యార్థులున్నారు.
5/ 7
ఈ ప్రమాదంలో కారు వంతెనను బలంగా ఢీకొట్టడంతో వంతెన కాంక్రీట్ ఫెన్సింగ్ విరిగి వాహనం నీళ్లు లేని నదిలో పడింది. వాహనం దాదాపు 40 అడుగుల వంతెనపై నుంచి కింద పడిపోయింది. మృతి చెందిన విద్యార్థులంతా 25-35 ఏళ్ల మధ్య వయస్కులే.
6/ 7
డియోలీ నుంచి వార్దాకు వెళుతుండగా, రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ప్రమాదం జరగడంతో.. తెల్లవారుజామున నాలుగు గంటలకు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై ప్రస్తుతం పోలీసులు, అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా,
7/ 7
ఈ విషాదకర ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి రూ.2లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. సీఎం సైతం విద్యార్థుల మరణాలపై విచారం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.