తొలుత బాలిక స్నేహితుడు ఒకరు ఆమె అత్యాచారం జరిపాడు. అతడు ఆ వీడియోను పలువురికి షేర్ చేశాడు. దీంతో ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని నిందితులు బాలికపై దారుణానికి పాల్పడ్డారు. జవనరి నుంచి సెప్టెంబర్ వరకు పలుమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి సంబంధించి బాలిక డొంబివాలీలోని మన్పాడ పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఘటనకు సంబంధించి తాము స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం.. ఇద్దరు మైనర్లతో సహా 23 మందిని అరెస్ట్ చేశామని అదనపు పోలీస్ కమిషనర్ చెప్పారు. బాలికపై అత్యాచారం జరిపిన వారు ఆమె తెలిసినవారేనని చెప్పారు. డొండివాలీ, రబాలే, ముర్భాద్.. ప్రాంతాల్లో పలు సందర్భాల్లో నిందితులు బాధితురాలిపై లైంగిక దాడులకు పాల్పడ్డారని చెప్పారు.(ప్రతీకాత్మక చిత్రం)
నిందితులపై సామూహిక అత్యాచారం సెక్షన్లతో పాటు పోక్సో కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు వె్లడించారు. ఈ కేసు విచారణకు ఏసీపీ సోనాలి డోల్ను దర్యాప్తు అధికారిగా నియమించారు. డీసీపీ సచిన్ గుంజల్తో పాటు తాను కూడా ఈ కేసును నిశితంగా పర్యవేక్షించనున్నట్టుగా అదనపు పోలీసు కమిషనర్ దత్తాత్రే కరాలే చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)