నోట్లో నుంచి నురగలు కక్కుతున్న ఆమెను చూసిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స జరుగుతుండగానే ఆ యువతి తుదిశ్వాస విడిచింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి స్నేహితురాలిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.