MADHYA PRADESH SADIST HUSBAND SEWS HIS WIFE PRIVATE PARTS AND RAN AWAY FROM HOME SRD
భార్యపై అనుమానం.. తనలో మృగాన్ని నిద్రలేపిన భర్త .. రాక్షసులు కూడా ఇలా చేయరు..
తాళికట్టాడు. కలకాలం తోడుంటానని వాగ్దానం చేశాడు. భార్యతో నూరేళ్లు అన్యోన్యంగా జీవించాల్సిన వాడు అనమానం పెంచుకున్నాడు. ఆ తరువాత అత్యంత అమానవీయంగా వ్యవహరించాడు.
తాళికట్టాడు. కలకాలం తోడుంటానని వాగ్దానం చేశాడు. భార్యతో నూరేళ్లు అన్యోన్యంగా జీవించాల్సిన వాడు అనమానం పెంచుకున్నాడు. ఆ తరువాత అత్యంత అమానవీయంగా వ్యవహరించాడు.
2/ 6
మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అనుమానంతో భార్య పట్ల ఓ భర్త క్రూరంగా ప్రవర్తించాడు. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త క్రూరమైన చర్యకు పాల్పడ్డాడు. తనలోని పశువును నిద్రలేపాడు.
3/ 6
ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే రైలా గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు పిల్లలు. పిల్లలు పుట్టిన తరువాత అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు.
4/ 6
ఆ అనుమానంతో రోజు భార్యను హింసించేవాడు. అయితే, రోజు రోజు కి అనుమాన భూతం పెరగడంతో భర్త అతని భార్య ప్రైవేట్ పార్ట్స్ ని కుట్టేశాడు. ఆమె మర్మాంగాన్ని దారంతో కుట్లు వేశాడు ఆ మృగాడు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆమె అక్రమ సంబంధానికి అవకాశం లేకుండా చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.
5/ 6
అయితే, దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకు ఆ భర్త పరారయ్యాడు. భర్త ఇంత చేసినా అతనిపై దయాగుణం ప్రదర్శించింది. పరారీలో ఉన్న తన భర్తను ఏం చేయొద్దని, చర్యలు తీసుకోవద్దని భార్య పోలీసులను కోరింది.
6/ 6
రెండు మంచి మాటలు చెప్పి పంపించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం బాధిత మహిళకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.