భార్యతో విడిపోయిన తర్వాత కూతురు హరిప్రియతో కలిసి ఉంటున్న హరికృష్ణన్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. కూతురంటే అతనికి చాలా ఇష్టం. ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. తల్లి దూరమయిన లోటు తెలియకుండా పెంచాడు. హరికృష్ణ జీవితం ఇలా సాగిపోతుండగా.. గోల్డెన్ స్ట్రీట్‌లో చిత్రాదేవి అనే ఓ మహిళ భర్త నుంచి విడిపోయి తండ్రితో కలిసి నివాసముంటోంది.
యోగా టీచర్‌గా చిన్న పిల్లలకు యోగా నేర్పుతూ ఆ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. హరికృష్ణన్ తన కుమార్తె హరిప్రియకు కూడా యోగా నేర్పించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే... చిత్రాదేవి వద్దకు కూతురును తీసుకెళ్లి తీసుకొస్తుండేవాడు. ఇలా హరికృష్ణన్‌కు, చిత్రాదేవికి మధ్య పరిచయం ఏర్పడింది. భార్య లేని హరికృష్ణ, భర్తకు దూరంగా ఉంటున్న చిత్రాదేవి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.