హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రైమ్ »

కోలీవుడ్ హాట్ బ్యూటీకి హ్యాకింగ్ కష్టాలు... ఆ ఫోటోలతో బ్లాక్‌మెయిల్, చంపేస్తామంటూ...

కోలీవుడ్ హాట్ బ్యూటీకి హ్యాకింగ్ కష్టాలు... ఆ ఫోటోలతో బ్లాక్‌మెయిల్, చంపేస్తామంటూ...

మీరా మిథున్... తెలుగువారికి పెద్దగా పరిచయం లేకపోయినా తమిళనాడులో క్రేజ్ ఉన్న సూపర్ మోడల్. ‘మిస్ సౌత్ ఇండియా’, ‘మిస్ తమిళనాడు’, ‘మిస్ క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా’ కిరీటాలు గెలుచుకున్న ఈ హాట్ మోడల్... ప్రస్తుతం ‘మిస్ తమిళనాడు’ అనే సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ‘8 తుటాక్కల్’, ‘తానా సేందకూటం’ వంటి సినిమాల్లో నటించిన మీరామిథున్‌కు కొందరు వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అందాల పోటీలను నిర్వహించడం ఆపేయాలంటూ... లేకపోతే చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె చెన్నై పోలీసులకు ఫిర్యాదుచేశారు. తన మొబైల్‌ను హ్యాక్ చేసి, అందులో ఉన్న తన ప్రైవేటు ఫోటోలు దొంగిలించారని, అందాల పోటీల్లో తమిళ యువతులను పూర్తిగా అనగదొక్కాలనే ఉద్దేశంతోనే తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించింది మీరా మిథున్. తనను బెదిరిస్తున్న అజిత్ రవి, అతని అనుచరులు జో, మైకిల్, ప్రవీణ్‌లపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది మీరా మిథున్. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ‘మిస్ తమిళనాడు దివా 2019’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Top Stories