పరాయివాడి భార్యను సోదరిగా భావించే భారత సమాజంలో భార్యల మార్పిడి విష సంస్కృతి క్రమంగా పేట్రేగుతోంది. ప్రధానంగా బాగా డబ్బులున్న బడాబాబులు తమ లైంగిక వాంఛలు తీసుర్చుకోడానికి భార్యలను ఎరలుగా వాడుకుంటుండటం, నీ భార్య నాకు, నా భార్య నీకు.. నీ భర్త నాకు.. నా భర్త కీకు.. అంటూ వంతులేసుకుని వికృతాలకు పాల్పడుతుండటం పెరిగిపోయింది.
భార్యల మార్పిడికి పాల్పడిన నిందితులు అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలకు చెందినవారిగా గుర్తించామని, మొత్తం 1000 జంటలపై నిఘా పెట్టామన్నారు పోలీసులు. మహిళ ఫిర్యాదు తర్వాత ఆమె భర్తతోపాటు సెక్స్ రాకెట్ లో భాగస్వాములైన ఏడుగురిని అరెస్ట్ చేశామని, మరో 25 మందిని విచారిస్తున్నామని పోలీస్ అధికారులు చెప్పారు.