Karnataka : హైవేపై కండోమ్‌లు .. అండర్‌గ్రౌండ్‌లో వ్యభిచారం.. చేధించిన పోలీసులు
Karnataka : హైవేపై కండోమ్‌లు .. అండర్‌గ్రౌండ్‌లో వ్యభిచారం.. చేధించిన పోలీసులు
Karnataka : కర్ణాటకలోని హైవే పై కుప్పలు తెప్పలుగా కండోమ్‌లు కనిపించిన కేసును ఆ రాష్ట్ర పోలీసులు చేధించారు. కండోమ్‌లు లభించిన ప్రాంతానికి సమీపంలోనే ఓ లాడ్జ్ నుండి ఇవి వచ్చినట్టు గుర్తించారు. లాడ్జ్‌లోని అండర్‌గ్రౌండ్‌లో వ్యభిచారం నడుపుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గత కొద్ది రోజుల క్రితం కర్ణాటక తుముకూర్ శివారులోని జాతీయ రహదారి 48పై వందల సంఖ్యలో కండోమ్ లు దర్శనమిచ్చాయి. ఇది చూసి అటుగా వెళ్లే వాహనదారులు ఆశ్చర్యపోయారు. శ్రీరాజ్ థియేటర్‌కు ఎదురుగా ఉన్న ఓ ఫ్లైఓవర్‌పై కండోమ్‌లు కుప్పలుగా కనిపించాయి.
2/ 8
కుప్పలు తెప్పలుగా పడి ఉన్న కండోమ్స్లలో కొన్ని వినియోగించిన కండోమ్ లు ఉండగా.. మరికొన్ని ప్యాకెట్లలో ఉన్నాయి. దాంతో స్థానికులు ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి..
3/ 8
దీంతో కర్ణాటక పోలీసులు రంగంలోకి దిగారు. పెద్ద ఎత్తున కండోమ్‌లు బయటపడంతో విమర్శలు చెలరేగాయి. దీంతో పదిహేను రోజుల విచారణ తర్వాత కండోమ్‌లు ఎక్కడ నుండి వచ్చాయనే దానిపై పోలీసులు క్లారీటి ఇచ్చారు.
4/ 8
పోలీసుల దర్యాప్తులో భాగంగా కండోమ్‌లు పడిన ప్రాంతంలోని ఓ లాడ్జ్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు.< ఆ లాడ్జిలో ఓ సొరంగాన్ని గుర్తించారు. ఆ సొరంగం ద్వారా వ్యభిచార కూపాన్ని నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
5/ 8
జాతీయ రహదారిపై కుప్పలుతెప్పలుగా పడి ఉన్న కండోమ్‌లు ఆ లాడ్జినుండే వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో సొరంగంలో ఉన్న వారిని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. సొరంగం ద్వార ఎవరి కంటకనపడకుండా సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నట్టు తేల్చారు.తీకాత్మక చిత్రం
6/ 8
పోలీసుల దాడిలో ముగ్గురు మహిళలతో పాటు ఒక పురుషున్ని అరెస్ట్ చేశారు. కాగా పోలీసులు వెళ్లిన చోట సొరంగం నుండి మహిళలు బయటకు రావడంతో పోలీసులు ఒక్కసారిగా అవక్కాయ్యారు. ఇక లాడ్జ్‌లో సెక్స్ రాకెట్ బయటపడడంతో ఆ లాడ్జిని మూసివేశారు.
7/ 8
పోలీసుల దాడిలో ముగ్గురు మహిళలతో పాటు ఒక పురుషున్ని అరెస్ట్ చేశారు. కాగా పోలీసులు వెళ్లిన చోట సొరంగం నుండి మహిళలు బయటకు రావడంతో పోలీసులు ఒక్కసారిగా అవక్కాయ్యారు. ఇక లాడ్జ్‌లో సెక్స్ రాకెట్ బయటపడడంతో ఆ లాడ్జిని మూసివేశారు.
8/ 8
దీంతో తమకూరు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి..సుమారు పదిహేను రోజుల అనంతంరం కేసును చేధించారు.ఇందుకోసం స్థానిక ఓ స్వచ్ఛంద సంస్థ సహకారాన్ని కూడా పోలీసులు తీసుకున్నట్టు తెలుస్తోంది. వారి సహాకారంతోనే లాడ్జీలో సోదాలు నిర్వహించినట్టు సమాచారం.