సెహోర్: మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో శివసేన పార్టీకి చెందిన ఓ మహిళ నేత ఇంట్లో నడుస్తున్న సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. నలుగురు యువతులు, మరో మహిళ, ముగ్గురు విటులు, ఈ చీకటి దందా నడిపిస్తున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సామాజిక కార్యకర్తగా సమాజంలో చలామణీ అవుతూ శివసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఓ మహిళ ఇలా వ్యభిచారం నడిపించిన విషయం తెలిసి స్థానికులు అవాక్కయ్యారు.
సదరు మహిళ శివసేన నుంచి మున్సిపల్ చైర్మన్ పదవికి కూడా పోటీ చేసినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని సెహోర్ ప్రాంతానికి చెందిన అనుపమ తివారి అనే అనే మహిళ నగర పాలిక చైర్మన్‌గా 2015లో శివసేన తరపున పోటీ చేసింది. సామాజిక కార్యకర్తగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేది. అందరూ ఆమెకు గౌరవం ఇచ్చేవారు. కానీ.. అనుపమ చేసిన పని తెలిసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆమెను గౌరవించిన వాళ్లే అసహ్యించుకుంటున్నారు.
ఒక సామాజిక కార్యకర్తగా వ్యభిచార కూపంలో చిక్కుకున్న యువతులను, మహిళలను కాపాడాల్సిన అనుపమ ఆమే స్వయంగా తన ఇంట్లో వ్యభిచార దందా నిర్వహిస్తూ పట్టుబడింది. సెహోర్ బస్టాండ్‌కు సమీపంలోని అనుపమ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అనుపమ తివారి సామాజిక కార్యకర్త అనే విషయం తెలిసిన పోలీసులు ఆ సమాచారం విని షాకయ్యారు.
ఈజీ మనీ ఆశచూపి మరికొందరిని ఈ వ్యభిచారం వైపు లాగుతున్నారని.. కొన్ని నెలలుగా సీక్రెట్‌గా అనుపమ ఈ సెక్స్ రాకెట్‌ను నడిపిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆమె సామాజిక కార్యకర్త కావడంతో అనుపమను కలిసేందుకు పలువురు వస్తూపోతూ ఉండటంతో స్థానికులకు అనుమానం కలగలేదని, కానీ.. రాత్రి సమయాల్లో కూడా కొందరు యువతులు, పురుషులు ఆమె ఇంటికి వస్తుండటంతో అనుమానం కలిగి ఆరా తీయగా ఈ చీకటి దందా అనుపమ నడిపిస్తున్నట్లు తెలిసింది.