Sad: ఈ ఫొటోలో కనిపిస్తున్న యువతి ఇప్పుడు మన మధ్య లేదు.. అసలేమైందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
Sad: ఈ ఫొటోలో కనిపిస్తున్న యువతి ఇప్పుడు మన మధ్య లేదు.. అసలేమైందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఈ ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు వందన కున్వర్బ. మధ్య గుజరాత్లోని పంచమహల్ జిల్లా ఘోఘంబ తాలూకాలోని కంకొడకొయ్ అనే గ్రామానికి చెందిన చంద్రసిన్హ్ సోలంకి కూతురైన ఈ యువతికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది.
1/ 6
అహ్మదాబాద్: ఈ ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు వందన కున్వర్బ. మధ్య గుజరాత్లోని పంచమహల్ జిల్లా ఘోఘంబ తాలూకాలోని కంకొడకొయ్ అనే గ్రామానికి చెందిన చంద్రసిన్హ్ సోలంకి కూతురైన ఈ యువతికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది.
2/ 6
జనవరి 23వ తేదీ పెళ్లి జరగాల్సి ఉంది. కానీ.. విధి రాత అంతకు ఒక రోజు ముందే ఈమెను మృత్యువు కబళించింది. జనవరి 22న గర్భా డ్యాన్స్ కూడా చేసిన ఈ యువతి అదే రోజు రాత్రి ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయింది.
3/ 6
దీంతో.. ఆమెను బంధువులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమెను పరీక్షించిన వైద్యులు Low Blood Pressure కారణంగా ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు.
4/ 6
కొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన కూతురు ఇలా ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయే సరికి వందన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమె పెళ్లి చూసేందుకు ఇంటికొచ్చిన బంధువులంతా ఆమె అంత్యక్రియల్లో పాల్గొనాల్సిన దీన పరిస్థితి ఎదురైంది.
5/ 6
మరోపక్క.. ఆమె చనిపోయిన విషయం అప్పటికి తెలియని పెళ్లి కొడుకు కుటుంబం పెళ్లి ఏర్పాట్లలో తలమునకలైంది. వందన చనిపోయిన విషయం తెలిసి వరుడు, అతని కుటుంబం కూడా దిగ్భ్రాంతికి లోనైంది.
6/ 6
వందన చనిపోయిన విషయం తెలిసి ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఊరు ఊరంతా ఈ యువతి చివరి చూపు కోసం ఆమె ఇంటి వైపు అడుగులేసింది.