ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని సుప్రీం కోర్టు 2017లో రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ మోదీ సర్కారు బిల్లును రూపొందించి లోక్సభలో ప్రవేశపెట్టింది. 2018లో లోక్సభ దానికి ఆమోదం తెలిపింది. కానీ, రాజ్యసభలో బిల్లు తిరస్కరణకు గురైంది. దాంతో ఎన్నికల వేళ కేంద్రం ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.