Hyderabad: మహిళకు యువకుడి నుంచి ఫోన్ కాల్స్.. తీరా ఆమే ఫోన్ చేసి ఇంటికి పిలవడంతో..
Hyderabad: మహిళకు యువకుడి నుంచి ఫోన్ కాల్స్.. తీరా ఆమే ఫోన్ చేసి ఇంటికి పిలవడంతో..
ఓ మహిళకు ఫోన్ చేసి అదేపనిగా వేధింపులకు పాల్పడుతున్నాడు ఓ యువకుడు. అయితే తీరా ఆ మహిళే అతడిని ఇంటికి రమ్మని పిలవడంతో అతడు ఆనందపడిపోయాడు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది.
వివరాలు.. హైదరాబాద్లోని సైదాబాద్ ప్రాంతం లక్ష్మినగర్లో నివాసం ఉంటున్న మహిళకు ఓ వ్యక్తి పదే పదే ఫోన్ చేసి విసింగించేవాడు. అసభ్యంగా మాట్లాడుతూ వేధించేవాడు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
అయితే ఆ మహిళ ఈ విషయాన్ని కుటుంబ సభ్యలకు తెలియజేసింది. దీంతో వారు ఆమెకు ఓ సలహా ఇచ్చారు. అనంతరం ఆ మహిళ చేతనే యువకుడికి ఫోన్ చేయించారు. అతడిని ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
దీంతో ఆ యువకుడు ఆనందంలో మహిళ ఇంటికి చేరాడు. అయితే అతడు ఇంట్లోకి రాగానే అతడిపై మహిళ కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఒంటిపై బట్టలు తీసేసి చితకబాదారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
అయితే ఇది గమనించిన స్థానికులు అతడికి దుస్తులు అందించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
అయితే ఈ ఘటనకు సంబంధించి ఇరువర్గాల నుంచి ఫిర్యాదు రాకపోవడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు. (ప్రతీకాత్మక చిత్రం)