పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌ను ఆమె రాసినట్లుగానే గుర్తించారు. ప్రత్యూష మృతదేహం వద్ద లభించిన కార్బన్ మోనాక్సైడ్ ఎక్కడ కొనుగోలు చేసిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. కొద్దికాలంగా ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
ఏమాత్రం నొప్పి తెలియకుండా ఈజీగా చనిపోవాలనే ఉద్దేశంతో ప్రత్యూష ఇంటర్నెట్లో కూడా వెతికినట్లు తెలుస్తోంది. పదిరోజుల క్రితమే ఆమె సూసైడ్‌కు ప్లాన్ చేసుకున్నారు. ఇంటి వద్ద కుటుంబసభ్యులు ఉంటారనే భయంతో ఆమె బోటిక్‌లో సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. వారం క్రితం వడ్రంగిని పిలిపించి.. ఆమె.. బోటిక్‌లో వాష్ రూం కిటికీలను,ఎగ్జాస్టర్ ఫ్యాన్ ప్రాంతాన్ని కూడా మూసివేయించింది.