ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాలు.. చార్మినార్ ఫారూక్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఏడాది క్రితం ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో శిక్షను అనుభవించాడు. అయితే రాజీ చేసుకుని అత్యాచారానికి పాల్పడిన యువతినే పెళ్లి చేసుకున్నాడు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో.. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
వ్యభిచార దందా నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు. 15 రోజుల క్రితం జల్పల్లి పురపాలిక షాహిన్ నగర్ బస్తీలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అదే ఇంట్లో కొందరు యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
అయితే ఈ విషయం వెలుగులోకి రావడం వెనక ఆటో డ్రైవర్‌కు అతని భార్యపై ఉన్న కోపమే కారణం. భార్యపై కక్షతో ఉన్న ఆటో డ్రైవర్.. ఆమె ఇంట్లో లేని సమయంలో మీడియాను పిలిచి తన భార్య వ్యభిచారం చేస్తోందిన తెలిపాడు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
అనంతరం ఇంటికి వచ్చిన భార్య విషయం తెలుసుకుని భర్తతో ఘర్షణకు దిగింది. దీంతో ఆ ఇంట్లో వ్యభిచార దందా కొనసాగుతున్న విషయం బయటపడింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ ఇంటిపై దాడి చేసిన బాలాపూర్ పోలీసులు ఇద్దరు యువతులను, ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. (ప్రతీకాత్మక చిత్రం)