Job Scam : చాలా మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నో ఆశలతో హైదరాబాద్ వెళ్తారు. అక్కడేదైనా ఉద్యోగం దొరికితే.. ముందు సెటిలై.. తర్వాత తమ గోల్ సాధించాలని కలలు కంటారు. అలాంటి యువతుల్ని టార్గె్ట్ చేసింది ఓ గ్యాంగ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరాన్ని నడిపిస్తూ.. హైటెక్ వ్యభిచారం చేస్తూ.. చివరకు పోలీసులకు చిక్కింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ రైడ్‌లో ఇద్దరు యువతులతో విటుడు ఎల్.రవీంద్రారెడ్డి దొరికాడు. అమ్మాయిలను సంరక్షణ గృహానికి పంపారు. తర్వాత పూర్ణిమకుమారి, ఆమెకు సాయం చేస్తున్న మనీష్‌కుమార్ పాండే, కాన్క్లేవ్ హోటల్ మేనేజర్ శ్రీమంతకలిటను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. నిందితుల నుంచి 12 ఫోన్లు, రూ.1,200 మనీ సీజ్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)