Affair: భార్య లవర్ చేసిన పనికి ఆ భర్త రగిలిపోయాడు.. తన భార్యతో అఫైర్ పెట్టుకుందే గాక అలా చేసేసరికి..

కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట తాలూకా భీమనబీడు గ్రామంలో శివణ్ణ తన భార్యతో కలిసి ఉంటున్నాడు. పెళ్లయిన కొన్నాళ్లు ఈ భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. కానీ.. రానురాను భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. శివణ్ణను దూరం పెడుతూ వేరొక మగాడికి దగ్గరయింది. ఆ వ్యక్తితో ఏర్పడిన పరిచయం కొన్నాళ్లకు అక్రమ సంబంధానికి దారితీసింది. శివణ్ణ కళ్లుగప్పి అతని భార్య, ఆమె ప్రియుడు పలుమార్లు శారీరకంగా కలిశారు.