రోహిణిలోని సెక్టార్ 16లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఫ్యాక్టరీలో పనిచేసే బబ్లూ అనే వ్యక్తితో రష్మీకి స్నేహం ఏర్పడిందనే ఆరోపణలున్నాయి. దీంతో అనిల్, రష్మీల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ గొడవ గురించి అనిల్ తన సోదరుడు సునీల్‌కు అప్పుడప్పుడు చెప్పేవాడు. అనిల్ కొద్దిసేపటి క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.(ప్రతీకాత్మక చిత్రం)
ఇంటికి తిరిగి వచ్చేసరికి బబ్లూ తన భార్యతో పాటు ఇంట్లో ఉండడం చూశాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. అనిల్ తన భార్య రష్మిని గొంతుకోసి హత్య చేసి, బయటి నుంచి తలుపులు వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. సుమారు 2 గంటల తర్వాత ఈ విషయాన్ని అనిల్ తన సోదరుడు సునీల్‌కు ఫోన్లో తెలిపాడు.(ప్రతీకాత్మక చిత్రం)