ఏడేళ్ల వయసున్న కొడుకు నీరజ్, ఐదేళ్ల వయసున్న పాప కూడా ఉంది. ఇద్దరినీ చూసుకుంటూ సంతోషంగానే ఉండేవారు. దీపూ ఓ కంపెనీలో డ్యూటీకి వెళుతుండేవాడు. భార్య ఈ మధ్య ఎక్కువగా ఫోన్ కాల్స్ చేస్తుండటాన్ని దీపూ గమనించాడు. తొలుత పట్టించుకోకపోయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు గమనించిన అతను భార్యను నిలదీశాడు. ఆమెతో గొడవ పెట్టుకున్నాడు.
ఆమెను కొట్టి చావుబతుకుల మధ్య ఉన్న ఆమెను అక్కడే వదిలేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వీళ్ల ఇంటి చుట్టూ నిర్మానుష్య ప్రాంతమే ఉండటంతో ఆమె కేకలు, అరుపులు కూడా ఎవరికీ వినిపించలేదు. అయితే.. తల్లిని ఆ స్థితిలో చూసిన ఆమె ఏడేళ్ల కొడుకు దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న ఓ షాపు దగ్గరకు వెళ్లి విషయం చెప్పడంతో హుటాహుటిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.