GUJARAT SHOCKER WOMAN SOLD OFF BY HUSBAND FOR RS 500 SU
భర్తతో కలిసి హోటల్‌కు వెళ్లిన భార్య.. అక్కడ రూ. 500 కోసం ఏ భర్త చేయకూడని విధంగా..
ఓ వ్యక్తి సభ్య సమాజం తలదించుకునే చర్యకు పాల్పడ్డాడు. ఏ భర్త.. భార్యతో చేయించకూడని పనిచేశాడు. కేవలం రూ. 500 కోసం తన భార్యను వేరే వ్యక్తికి విక్రయించాడు.
వివరాలు.. 21 ఏళ్ల మహిళకు గుజరాత్‌లోని మౌ ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. గురవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మహిళ.. తన భర్తతో కలిసి లక్కీ హోటల్‌కు వెళ్లింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
ఆ సమయంలో సోనూ శర్మ అనే వ్యక్తి మహిళ భర్తను సంప్రదించాడు. మహిళను తనతో పంపేందుకు రూ. 500 ఇస్తానని సోనూ శర్మ ఆమె భర్తకు చెప్పాడు. అయితే ఇందుకు అంగీకరించిన మహిళ భర్త ఆమెను అతనితో పంపాడు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
ఆ తర్వాత శర్మ ఆ మహిళను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు, అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
కేసు గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. బాధిత మహిళను సికార్‌లోని సఖి సెంటర్‌కు తరలించారు. (ప్రతీకాత్మక చిత్రం)