అహ్మదాబాద్‌కు చెందిన ఒక 15 ఏళ్ల బాలిక కరోనా ఎఫెక్ట్ తో ఇంట్లోనే ఉంటోంది. ఆన్లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులు ఆమెకు ఒక మొబైల్ ఫోన్ కొనిపెట్టారు. అంతా సాఫీగా జరుగుతుండగా.. వీళ్ల బంధువుల అమ్మాయి ఆ తల్లిదండ్రులకు ఒక రోజు షాకింగ్ వీడియో పంపింది. ఆ వీడియోలో వీళ్ల 15 ఏళ్ల కుమార్తె నగ్నంగా కన్పించింది.
ఆ వీడియోకు విపరీతమైన స్పందన రావడంతో అది అలవాటుగా మారింది. ఆ వెబ్సైట్లో ఆమె అప్లోడ్ చేసిన వీడియోలన్నింటినీ తొలగించిన అధికారులు.. సైబర్ నేరాలు ఎలా జరుగుతాయో ఆమెకు వివరించారు. ఆ తర్వాత తల్లిదండ్రుల అనుమతి లేకుండా మొబైల్ ముట్టుకోనని ఆ బాలిక ఒట్టేసింది. దీంతో ఆ తల్లిదండ్రుల ఆందోళన ఒకింత సద్దుమణిగింది.