అరబ్, గల్ఫ్ దేశాల నుంచీ ఇండియాలోకి బంగారాన్ని సీక్రెట్‌గా తెస్తున్న గ్యాంగ్స్ ఎక్కువవుతున్నాయి. కస్టమ్స్ అధికారులు ఎన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నా... కొత్త కొత్త పద్ధతుల్లో ఈ స్మగ్లింగ్ సాగుతోంది.
2/ 5
గల్ఫ్ దేశాలతో పోల్చితే మన దేశంలో బంగారం రేటు ఎక్కువగా ఉండటం, డిమాండ్ బాగా పెరుగుతుండటంతో స్మగ్లింగ్ యధేచ్చగా సాగుతోంది. ఎంతో మందిని అరెస్టు చేస్తున్నా... మరింత మంది గోల్డ్ తెస్తూనే ఉన్నారు.
3/ 5
తాజాగా రాజస్థాన్‌లో కస్టమర్స్ అధికారులు షాజహాన్ అనే ప్రయాణికుడి దగ్గర బంగారం రంగులో ఉన్న పచ్చడి ప్యాకెట్లను చూశారు. అదేం పచ్చడి అని అనుకుంటూ దాన్ని పరిశీలిస్తే... అందులో బంగారం ద్రవరూపంలో ఉన్నట్లు కనిపించింది. ఆశ్చర్యపోయారు.
4/ 5
ఆ ప్యాకెట్లలో బంగారాన్ని వేరు చేసేందుకు 10 గంటలపాటూ శ్రమించారు అధికారులు చివరకు 733 గ్రాముల గోల్డ్ వెలికి తీశారు. బంగారం పచ్చడితోపాటూ... గోల్డ్ బిస్కెట్లను కూడా ఆ పచ్చడిలో వేశాడు ప్రయాణికుడు షాజహాన్. ఎయిర్ అరేబియా విమానంలో వచ్చిన అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
5/ 5
షాజహాన్ ముంబైలో నివసిస్తున్నట్లు తెలిసింది. కొంతకాలంగా అతడు ఇలాగే బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నాడని తెలుసుకున్నారు.