రాంచీ: వివాహేతర సంబంధాల మోజులో పడి కొందరు బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అఫైర్ నేపథ్యంలో హత్య చేసి నేరస్తులుగా మారుతున్న వారు కొందరైతే, విషయం బయటకు పొక్కి పరువు పోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్న వారు కొందరున్నారు. జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ యువకుడు ఒక కానిస్టేబుల్. పేరు నవీన్. భర్తను కోల్పోయిన ఓ మహిళతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే ఆమె ఇంటికి వెళ్లి వస్తుండేవాడు.
అదే సమయంలో భర్త నుంచి విడాకులు తీసుకుని ఆ ఇంట్లో ఆమెతో పాటు కలిసి ఉంటున్న ఆమె కూతురితో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి వివాహేతర సంబంధం కొనసాగించేత వరకూ వ్యవహారం వెళ్లింది. కూతురితో ఆ యువకుడి అఫైర్ గురించి తల్లికి తెలుసు. కానీ ఆ కూతురికి తెలియని విషయం ఏంటంటే.. ఆ కానిస్టేబుల్ ఆమె తల్లితో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని. ఆమెకు తెలియకుండా ఆ యువకుడు ఆమె తల్లితో పలుమార్లు లైంగికంగా కలిశాడు.
అయితే.. ఈ విషయం కూతురికి తెలియకుండా ఆమె తల్లి, యువకుడు జాగ్రత్తపడేవారు. ఈ క్రమంలోనే.. శనివారం కూతురు ఇంట్లో లేని సమయంలో ఆమె తల్లిని కలిసేందుకు సదరు కానిస్టేబుల్ ఇంటికి వెళ్లాడు. ఆమెతో బెడ్‌పై రాసలీలలు సాగిస్తున్నాడు. ఆమెకు, ఆ యువకుడికి ఒంటి మీద నూలు పోగు లేదు. అలా వాళ్లు ఉన్న సమయంలో బయట నుంచి ఇంటికి వచ్చిన ఆ మహిళ కూతురు ఇద్దరినీ అలా చూసి షాకైంది.
ఏంటీ పనంటూ తల్లిని, ప్రియుడిని నిలదీసింది. నవీన్‌తో గొడవ పెట్టుకుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ కారణంగా సహనం కోల్పోయిన నవీన్ క్షణికావేశంలో గన్‌తో తన ప్రియురాలిని తుపాకీతో కాల్చాడు. అయితే.. అదృష్టవశాత్తూ ఆ బుల్లెట్ ఆ మహిళ తలకు కాకుండా గోడకు తగిలింది. ఈ పరిణామంతో ఆ మహిళ తల్లి భయంతో వణికిపోయింది.
చావు తప్పి ప్రాణాలు దక్కించుకున్న సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవీన్ తనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తనకు కాల్చి చంపే ఉద్దేశం లేదని, ఏదో తాగిన మత్తులో క్షణికావేశంలో కాల్చానని నవీన్ పోలీసు విచారణలో చెప్పాడు.