హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో అదే జరిగింది. తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ప్రియుడు తన కూతురిపై కన్నేశాడని తెలుసుకున్న ఆ మహిళ అతనిని పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫరీదాబాద్‌లోని సెక్టార్ 75లో పది రోజుల క్రితం సగం కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
ఫరీదాబాద్‌లోని ఓ కంపెనీలో ఆ మహిళ పనిచేస్తుందని తెలిసింది. ఆమె భర్త 2018లో చనిపోయాడు. ఆమెకు 13 ఏళ్ల వయసున్న కూతురు ఉంది. పవన్‌తో కొన్నేళ్లుగా సదరు మహిళ వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అతనితో కలిసి ఆ మహిళ బయటకు కూడా వెళుతుండేది. అయితే.. కొన్ని రోజుల నుంచి పవన్ ఆమె కూతురిపై కన్నేశాడు. ఇది తప్పని చెప్పినా పట్టించుకోకుండా పవన్ ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
ఆ తర్వాత అతనికి సెక్టార్ 75 ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సదరు మహిళ పవన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో పవన్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు పది రోజుల తర్వాత నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తన కూతురిని తప్పుడు దృష్టితో చూస్తూ, అసభ్యంగా ప్రవర్తించినందు వల్లే పవన్‌ను హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించింది.